: నేను ఎప్పుడూ ప్రేమలో విఫలం కాలేదు: అనుష్కశర్మ


‘నేను చాలా ప్రాక్టికల్. నేను ఎప్పుడూ ప్రేమలో విఫలం కాలేదు. అంత తొందరగా ప్రేమలో పడను’ అంటూ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ చెప్పింది. అనుష్క నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఆమె మాట్లాడిన సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చింది. తన కాలేజీ రోజుల్లో తన ఫ్రెండ్స్ చాలా మంది ప్రేమలో పడ్డారని చెప్పిన అనుష్క, తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించడానికి తాను ఇష్టపడనంది. అదేవిధంగా, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టముండదని చెప్పింది. కాగా, ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో ప్రేమలో విఫలమైన యువతి పాత్రను ఆమె పోషించింది.

  • Loading...

More Telugu News