: డొనాల్డ్ ట్రంప్‌కి ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మ గౌరవం కూడా ఎంతో త‌క్కువ‌: రచయిత దీపక్‌ చోప్రా


అమెరికా అధ్యక్ష పీఠం కోసం హిల్ల‌రీ క్లింట‌న్‌తో పోటీప‌డుతున్న‌ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడిన భారత సంతతికి చెందిన అమెరికన్‌ రచయిత గురు దీపక్‌ చోప్రా ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. తాను ట్రంప్‌కి ఓటు వేయ‌బోన‌ని చెప్పారు. ట్రంప్ ప్ర‌ద‌ర్శించే భావోద్వేగాలు, వైఖ‌రి ఓ మూడేళ్ల చిన్నారిలా ఉంటాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మ గౌరవం కూడా ఎంతో త‌క్కువ‌గా ఉంద‌ని దీప‌క్ చోప్రా అన్నారు. ట్రంప్‌కు ముందు చూపులేద‌ని వ్యాఖ్యానించారు. ఏ విషయాన్నైనా స‌మ‌గ్రంగా అర్థం చేసుకోగల నేర్పు కూడా ఆయ‌న‌లో లేద‌ని చెప్పారు. ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే స‌మ‌ర్థ‌త కూడా ఆయ‌న‌లో లేద‌ని దీప‌క్ మిశ్రా పేర్కొన్నారు. తాను ట్రంప్‌లో కోపం, భయం, పగ, నిరాశల‌ను చూసిన‌ట్లు చెప్పారు. ట్రంప్ ఒక‌ అపరాధి అని, ఆయ‌న‌ మెదడుతో ఆలోచించడని మిశ్రా అన్నారు. ట్రంప్‌పై ప‌లువురు మహిళలు ఎన్నో ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News