: సబ్బీర్ రెహ్మాన్ నటించిన యాడ్ నిలిపివేయాలంటూ ‘బంగ్లా’ క్రికెట్ బోర్డు ఆదేశం
తమ క్రికెటర్ సబ్బీర్ రెహ్మాన్ నటించిన యాడ్ ను నిలిపివేయాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అయిన ‘ఆస్కార్’ను ప్రమోట్ చేస్తూ నటించిన ఈ యాడ్ లో మోడల్ నైలా నయీమ్, రెహ్మాన్ శ్రుతిమించిన డైలాగ్ లు ఉన్నాయట. ఈ యాడ్ ను చూసిన వారు సామాజిక మాధ్యమం వేదికగా వీళ్లిద్దరిపై విమర్శల వర్షం కురిపించారు. ఈ యాడ్ ఆగస్టు నుంచి టీవీల్లో వస్తున్నప్పటికీ, ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రెహ్మాన్ అందరి దృష్టిిని ఆకర్షించడమే కాకుండా, విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఇటువంటి ప్రకటనలు ‘బంగ్లా’ క్రికెటర్లకు సరికావని, వారి గౌరవాన్ని నిలబెట్టలేవంటూ, ఈ యాడ్ ను తక్షణం నిలిపివేయాలంటూ సదరు సంస్థను ఆదేశించింది.