: న్యూజిలాండ్‌ ప్రధానికి ఘనస్వాగతం పలికిన నరేంద్ర మోదీ


న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌కీ భారత పర్యటన ప్రారంభమైంది. ఆయ‌న‌కు రాష్ట్రపతి భవన్‌ వద్ద ప‌లువురు కేంద్ర‌మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో స‌హా భార‌త‌ ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. అనంత‌రం రాజ్‌ఘాట్‌కు వెళ్లిన జాన్‌కీ మ‌హాత్మా గాంధీకి నివాళులర్పించారు. తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన కార‌ణంగా జాన్‌కీ భారత పర్యటన ఆలస్యం అయింది. ఈశాన్య క్వీన్స్‌లాండ్‌లోని తీర ప్రాంత పట్టణం టౌన్స్‌విల్లెలోనే ఉండిపోయిన ఆయ‌న వేరే విమానం ద్వారా భార‌త్ చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. జాన్‌కీ భార‌త్‌ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర‌ మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. కొచ్చిలో త‌మ‌దేశం చేపడుతున్న అంతర్జాతీయ టెర్మినల్‌ను కూడా జాన్‌కీ పరిశీలిస్తారు.

  • Loading...

More Telugu News