: నిర్మల్ లో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం.. ధర్నాకు దిగిన గ్రామస్తులు
నిర్మల్ జిల్లాలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. నర్సాపూర్ మండలం బొల్లమాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుండగుల చర్యను ఖండిస్తూ ఈ రోజు ధర్నాకు దిగారు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.