: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ కోర్టు


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్పకు అవినీతి ఆరోపణల కేసులో క్లీన్ చిట్ లభించింది. బళ్లారి మైనింగ్ కేసులో యడ్డీని నిర్దోషిగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, ఈ వ్యవహారంలో రూ. 40 కోట్లు లంచం తీసుకున్నట్టు యడ్డీపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి కాగా... యడ్డీతో పాటు మరో ముగ్గురిని సీబీఐ కోర్టు ఈ రోజు నిర్దోషులుగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News