: గాలి జనార్దనరెడ్డి కూతురు పెళ్లిపై ఐటీ నిఘా?
అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై బయటకు వచ్చిన గాలి జనార్దనరెడ్డి... తన కుమార్తె పెళ్లి వెడ్డింగ్ కార్డుతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. గాలి వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ ను చూసి, అందరూ ముక్కున వేలేసుకున్నారు. వెడ్డింగ్ కార్డే ఈ స్థాయిలో ఉంటే... ఇక, పెళ్లి ఏ రేంజ్ లో జరగబోతోందో చెప్పకనే చెప్పారు గాలి. మరోవైపు, పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రూ. 550 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. దీంతో, ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అప్రమత్తమైనట్టు సమాచారం. గాలి ఖర్చు పెడుతున్న సొమ్ము సక్రమంగా సంపాదించిందా? లేక అక్రమమైనదా? అనే కోణంలో ఐటీ శాఖ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, గాలి ఆస్తులపై మరోసారి దర్యాప్తు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.