: గురుకుల వసతిగృహం నుంచి ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
బాలికల గురుకుల వసతిగృహం నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులు అదృశ్యమైనట్లు గమనించిన వసతిగృహం సిబ్బంది వెంటనే భీమడోలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.