: ద్విచక్రవాహనం లోయలోపడి ఇద్దరు విద్యార్థుల మృతి.. మరో విద్యార్థికి గాయాలు


ద్విచక్రవాహనం అదుపుతప్పి లోయలో పడిపోవ‌డంతో ఇద్దరు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘోర‌ ప్ర‌మాద‌ ఘ‌ట‌న తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థి తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన యువ‌కులు రంపచోడవరంలోని మెనోరా ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దువుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. గాయాల‌పాల‌యిన విద్యార్థిని ద‌గ్గ‌ర‌లోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News