: హైదరాబాద్‌లో మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ వీరంగం.. దేహశుద్ధి చేసిన స్థానికులు
మద్యం మత్తులో వీరంగమేసిన ఓ క్యాబ్ డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్ హైదరాబాదు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రీనగర్ కాలనీ సమీపంలో బీభత్సం సృష్టించాడు. మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న నలుగురిని ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌ను బయటకు లాగి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.