: చరిత్రలో తొలిసారి అమెరికాను వరించిన 'బుకర్ ప్రైజ్'


ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఓ అమెరికన్ రచయితను ప్రతిష్టాత్మక 'మ్యాన్ బుకర్ ప్రైజ్' వరించింది. యూఎస్ రచయిత పాల్ బీటీ రచించిన 'ద సెల్ ఔట్' నవలకు ఈ పురస్కారం దక్కింది. తన స్వస్థలమైన లాస్ ఏంజెలెస్ నేపథ్యంలో, జాతుల మధ్య సమానత్వం కోసం వ్యంగ్యంగా ఆయన ఈ రచన చేశారు. ఈ సందర్భంగా జ్యూరీ మాట్లాడుతూ, ఊహించనంతగా ఈ నవల హాస్యాన్ని పండించిందని కితాబిచ్చింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా పాల్ బీటీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. తన నవలకు ఈ స్థాయిలో గౌరవం దక్కుతుందని తాను భావించలేదని ఆయన అన్నారు. వాస్తవానికి కామన్వెల్త్ దేశాల రచయితలకు ఈ ప్రైజ్ ఇస్తూ వచ్చారు. కానీ, 2013లో ఈ సంప్రదాయాన్ని మార్చి, ఇంగ్లీష్ మాట్లాడే దేశాల రచయితలకు కూడా ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, ఓ అమెరికన్ కు తొలిసారి ఈ పురస్కారం దక్కింది.

  • Loading...

More Telugu News