: వైసీపీ చీఫ్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం కర్నూలు యువభేరిలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరుకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. భద్రతా సిబ్బంది కాన్వాయ్ నుంచి దిగి జగన్‌కు రక్షణ వలయం ఏర్పాటు చేశారు. కారు టైరు మార్చిన తర్వాత తిరిగి అదే కారులో జగన్ హైదరాబాద్ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News