: నా ఇంట్లోనే ఇంకుడు గుంత లేదు.. ఈ కేసు నేనెలా విచారిస్తానన్న హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి


ఇంకుడు గుంతలకు సంబంధించి కోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లోనే ఇంకుడు గుంత లేదని, అది ఏర్పాటు చేసుకున్నాకే ఈ వ్యాజ్యాన్ని విచారిస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, తనదో చిన్ని ఇల్లు అని, ఇంకుడు గుంత ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా తెలియదని, ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో చెప్పాలంటూ పిటిషనర్, జీహెహెచ్ఎంసీ తరపు న్యాయవాదులను కోరారు. నివాస గృహాల్లో శాశ్వత ప్రాతిపదికన ఇంకుడుగంతల ఏర్పాటు, నీటి పరిరక్షణ కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఏసీజే పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News