: పేదరికం నిర్మూలనలో పురందేశ్వరి చాలా స్పీడు


మన నాయకులు విజన్‌ 2020 అంటూ, అంతకంటె దూర లక్ష్యాలను నిర్దేశిస్తూ కాలయాపన చేస్తోంటే.. కేంద్ర మంత్రి పురందేశ్వరి మాత్రం మన దేశంలో పేదరికాన్ని నిర్మూలించే విషయంలో చాలా స్పీడు మీదున్నట్లు కనిపిస్తున్నారు. 2015 కెల్లా మన దేశంలో పేదరికాన్ని 26 శాతానికి తగ్గించవచ్చునని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మన దేశంలో పారిశుధ్య సమస్యను డీల్‌ చేయడమే పెద్ద పని అట. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వారి అంతర్జాతీయ సమావేశంలో పురందేశ్వరి ఈ వివరాల్ని వెల్లడించారు. 2015లోగా.. 23.9 శాతానికి పేదరికాన్ని తగ్గించాలని భారత్‌ నిర్ణయించుకున్నదట. కానీ.. 26 శాతం వరకు చేరుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News