: ధోనీని చూసి న్యూజిలాండ్ క్రికెటర్లు ఆశ్చర్యపోయిన వేళ!..ఆ దృశ్యం మీరూ చూడండి !


టీమిండియా కెప్టెన్ ధోనీని చూసి న్యూజిలాండ్ క్రికెటర్లు టామ్ లాథమ్, రాస్ టేలర్ ఆశ్చర్యపోయారు. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అంటే... ధోనీ స్వస్థలమైన రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో భారత్- న్యూజిలాండ్ మధ్య నాల్గో వన్డే మ్యాచ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ తన హమ్మర్ కారులో వెళ్తుండగా, అదే సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ బస్సులో వెళ్తోంది. ఆ బస్సు పక్కనుంచే ధోనీ వాహనం వెళుతుండటం, లాథమ్, టేలర్లు అది గమనించడం జరిగింది. దీంతో, సంతోషంతో పాటు వారు ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా, బైక్ లు, కార్లు అంటే అమితంగా ఇష్టపడే ధోనీ వద్ద, 23 బైక్ లు, 10కి పైగా కార్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో భారత్ 2, న్యూజిలాండ్ 1 మ్యాచ్ లో విజయం సాధించాయి. రేపు జరగబోయే నాల్గో వన్డేలో ఎవరి సత్తా ఏమిటో తెలియనుంది.

  • Loading...

More Telugu News