: ఏపీలో ఎస్సై పోస్టుల సంఖ్య వందల్లో.. వచ్చిన దరఖాస్తుల సంఖ్య లక్షకు పైమాటే!
ఏపీలో ఎస్సై పోస్టుల సంఖ్య వందల్లో ఉంటే, అప్లై చేసిన వారి సంఖ్య మాత్రం లక్షకు పైమాటే. ఎస్సై ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. అయితే, 735 ఉద్యోగాల కోసం ఏకంగా 1,23,937 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు దారుల్లో 1,12,355 మంది పురుషులు కాగా, 11,582 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. ఎస్సై ఉద్యోగాల నిమిత్తం మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూల్ జిల్లా నుంచి అత్యధికంగా 13 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.