: భారత పారిశ్రామిక దిగ్గజం ‘టాటా గ్రూప్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
భారత పారిశ్రామిక దిగ్గజం ‘టాటా సన్స్’ పగ్గాలను రతన్ టాటా చేజిక్కించుకున్న విషయం విదితమే. ఇప్పటివరకు ఆ సంస్థ చైర్మన్ గా వ్యవహరించిన సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలకడం, నాలుగు నెలల పాటు రతన్ టాటా తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ లలో ఒకటైన ‘టాటా గ్రూపు’ గురించిన ఆసక్తికర విషయాల్లో కొన్ని... * ఈ సంస్థను పార్శీ ఇండస్ట్రియలిస్ట్ జెంషెడ్ జీ టాటా 1868లో స్థాపించారు. * వ్యాపార విస్తరణ.. స్టీల్ నుంచి ఉప్పు, టీ, వాచ్ లు, లగ్జరీ కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు. సుమారు 100 దేశాల్లో కన్నా ఎక్కువగానే కొనసాగుతున్న ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు 100 బిలియన్ డాలర్లు కంటే పైమాటే. * టాటా గ్రూప్ నకు సంబంధించి హై-ప్రొఫైల్ కంపెనీల్లో ముఖ్యమైనది వాహనాలు తయారు చేసే టాటా మోటార్స్. బ్రిటన్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు పేరెంట్ ఆర్గనైజేషన్ ఇది. * టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటాస్టీల్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా కెమికల్స్ ఉన్నాయి. * టాటా టెలీ సర్వీసెస్ ద్వారా టెటీ కమ్యూనికేషన్ రంగంలో సేవలందిస్తోంది. * బ్రిటన్ కు చెందిన టెట్లే టీ, ఆంగ్లో- డచ్ స్టీల్ సంస్థల పేరెంట్ ఆర్గనైజేషన్ టాటాస్టీలే.