: కోహ్లీని దాటగల మొనగాడు అతనే!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన ఫాంలో ఉన్న కోహ్లీ ప్రతి సిరీస్ లోనూ భారీ స్కోరు సాధిస్తూ, బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ రికార్డులు అందుకోగల సత్తా ఉన్న క్రికెటర్ గా కోహ్లీ నీరాజనాలు అందుకుంటున్నాడు. 174 వన్డేల్లో 26 సెంచరీలు చేసిన కోహ్లీ రికార్డులను చెరిపేసే సత్తా ఉన్న ఆటగాడు కేవలం ఒకే ఒక్కడు కనిపించడం విశేషం. అతడే సౌతాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా...! 140 వన్డేలు ఆడిన ఈ ఆటగాడు ఇప్పటివరకు 23 సెంచరీలు చేశాడు. తక్కువ మ్యాచ్ లలో ఆమ్లా ఎక్కువ సెంచరీలు చేయడంతో, సెంచరీల రికార్డులో కోహ్లీని దాటగల సత్తా ఉన్న ఆటగాడిగా ఆమ్లాను క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రేసులో 24 సెంచరీలతో ఏబీ డివిలియర్స్ ఉన్నప్పటికీ ఈ 24 సెంచరీలు చేసేందుకు అతను 206 మ్యాచ్ లు తీసుకున్నాడు. దీంతో 27 ఏళ్ల కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టే రేసులో 34 ఏళ్ల ఆమ్లా ముందున్నాడు.