: స్వరూపానంద వ్యాఖ్యలపై ‘షిర్డీ సంస్థాన్’ స్పందించే వరకు షిర్డీ వెళ్లకండి!: సాయి భక్త సంఘాల పిలుపు


షిర్డి సాయిపై ద్వారక శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ‘షిర్డీ సంస్థాన్’ స్పందించే వరకు భక్తులెవరూ షిర్డీ వెళ్లొద్దంటూ సాయి భక్త సంఘాలు పిలుపు నిచ్చాయి. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన స్వరూపానంద సరస్వతి షిర్డి సాయిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. హైదరాబాద్ లలితకళాతోరణంలో ఇటీవల జరిగిన ‘గురువందనమ్’ కార్యక్రమంలో, హన్మకొండలో నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొన్న స్వరూపానంద షిర్డి సాయిపై వ్యాఖ్యలు చేయడం విదితమే. షిర్డి సాయిని పూజించడమంటే భూతాన్ని పూజించడమేనని, దేశానికి కావాల్సింది షిర్డి సాయి కాదు.. సుదర్శన చక్రాల స్థాపన అంటూ స్వరూపానంద చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

  • Loading...

More Telugu News