: షిర్డిలో కట్టింది సాయి ఆలయం కాదు.. శ్మశానం : స్వరూపానంద
షిర్డిసాయి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ద్వారక శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షిర్డిలో కట్టింది సాయిబాబా ఆలయం కాదని, శ్మశానం మాత్రమేనని, శ్మశానానికి హిందువులెవ్వరూ వెళ్లరని వ్యాఖ్యానించారు. అపూజ్యులను పూజించడం వల్లే కరవు, కష్టాలు వస్తాయని, షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ విడుదల చేసిన సాయిచాలీసా, సాయి పురాణాలలో సాయిబాబా ముస్లిం అని స్పష్టంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా గోవధను నిషేధించాలని స్వరూపానంద అన్నారు.