: ఏపీని విమానయాన హబ్ గా మారుస్తాం: సీఎం చంద్రబాబు


ఏపీని విమానయాన హబ్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విమానయాన సంస్థల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, ట్రూజెట్, స్పైస్ జెట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, తిరుపతి, కడపలకు కనెక్టివిటీని పెంచాలని అన్నారు. కనెక్టివిటీకి సంబంధించి త్వరలోనే కేంద్రం బిడ్డింగ్ కు ఆహ్వానిస్తుందన్నారు. విజయవాడ విమానాశ్రయంలో డిసెంబర్ నాటికి కొత్త టెర్మినల్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఆకర్షణీయ ప్యాకేజ్ లు, హెలి టూరిజం గురించి చంద్రబాబు ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News