: ప్రివిలేజ్‌ కమిటీని తక్కువచేసి వ్యాఖ్యలు చేయకూడదు: వైసీపీ నేతలకు సూచించిన గొల్లపల్లి


గత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రదర్శించిన ప్ర‌వ‌ర్త‌న‌పై స‌భా హ‌క్కుల సంఘం ఈ రోజు విచార‌ణ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు స‌భ‌లో ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి స‌మాధానం చెప్పారు. ఈ సంద‌ర్భంగా విచార‌ణ అనంత‌రం ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. ఆ మూడు రోజులు అసెంబ్లీలో జరిగిన పరిస్థితుల్ని తాము ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచార‌ణ జ‌రుగుతోంద‌ని, త‌మ‌ కమిటీలోని అంద‌రి స‌భ్యుల అభిప్రాయాల‌ మేరకే ఓ నిర్ణయం తీసుకుంటామని గొల్లపల్లి పేర్కొన్నారు. ప్రివిలేజ్‌ కమిటీని చులకన చేసి మాట్లాడ‌కూడ‌ద‌ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల‌కు ఆయ‌న సూచించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు కొంద‌రు ఎమ్మెల్యేలు క‌మిటీ ముందు హాజ‌రుకాలేదు. రేపటి సమావేశం ముగిసిన తర్వాత స్పీకర్‌కు ఈ అంశంపై తాము నివేదిక ఇవ్వనున్నట్లు గొల్లపల్లి చెప్పారు.

  • Loading...

More Telugu News