: త్వరలోనే ఏపీకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం ఆమోదముద్ర వేస్తుంది: సుజనా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకి బదులు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీకి కేంద్రం త్వరలోనే ఆమోద ముద్ర వేయనుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి ఈ రోజు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన సాయానికి గ్యారంటీ కోరనున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతనెల 7న కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇస్తున్నట్లు పేర్కొన్న విషయం విదితమే. ప్యాకేజీతో పాటు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు, పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపింది.