: వెస్టిండీస్ పై పాకిస్థాన్ ఘన విజయం


వెస్టిండీస్ తో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 133 పరుగుల తేడాతో విండీస్ ఓటమి పాలయింది. 456 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ 322 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి రోజున నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్... మరో 151 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. 95 పరుగులతో బ్లాక్ ఉడ్ రాణించినా... జట్టును గట్టెక్కించలేకపోయాడు. పాకిస్థాన్ యువ స్పిన్నర్ యాసిర్ షా 6 వికెట్లు తీసి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో సిరీస్ ను 2-0తో పాక్ కైవసం చేసుకుంది. మూడో టెస్టు 30న షార్జాలో జరగనుంది. స్కోరు వివరాలు: పాకిస్థాన్: 452 & 227/2 డిక్లేర్డ్ విండీస్: 224 & 322 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యాసిర్ షా (రెండు ఇన్నింగ్స్ లలో 10 వికెట్లు)

  • Loading...

More Telugu News