: ఒడిశాలో వంతెనపై నుంచి కిందకు పడిపోయిన బస్సు.. నలుగురి మృతి.. 25 మందికిపైగా గాయాలు
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ మార్గం గుండా వంతెనపై నుంచి వెళుతోన్న బస్సు అదుపుతప్పి కిందకు పడిపోయింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 25 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.