: నరేంద్రమోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్చి వాట్సప్ లో పెట్టి బుక్కయ్యాడు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టినందుకు ముజఫర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి వాట్సప్ గ్రూప్‌లో అభ్యంతరకరంగా పెట్టిన మోదీ ఫొటోను గమనించిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న ఆ ఫొటో మోదీని అవమానపరిచేలా ఉందని పోలీసులు తెలిపారు. అభ్యంతరకర ఫొటో పెట్టిన వ్యక్తిపై తాము పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.