: సభాపతిగా నాకు ఎవరిపైనా ప్రత్యేకంగా ప్రేమ, విరోధం ఉండవు: ఏపీ స్పీకర్ కోడెల
సభాపతిగా తనకు ఏ సభ్యుడిపైనా ప్రత్యేకంగా ప్రేమ, విరోధం అంటూ ఉండవని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సభ సజావుగా నిర్వహించడమే తన బాధ్యత అని అన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ శాసనసభలో నినాదాలు చేసిన 12 మంది విపక్ష సభ్యులకు హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడంపై కోడెల స్పందిస్తూ..ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.