: ప్రేమ ద్రోహి... ప్రియురాలిని ట్రైన్ కిందికి తోసేసిన ప్రియుడు


విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బ్యాండ్ పార్టీలో పాటలు పాడే సందర్భంలో రామకృష్ణ అనే యువకుడితో బాధిత యువతి నీలవేణి ప్రేమలో పడింది. గత కొన్నేళ్లుగా ప్రేమ సాగుతుండడంతో, యువతి పెళ్లి విషయంలో అతనిపై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు 10 లక్షల రూపాయలు కట్నం కావాలంటూ రామకృష్ణ డిమాండ్ చేయడంతో, తన ఆర్థిక స్తోమత తెలిసి కూడా డబ్బు అడిగితే ఎలా? అని ఆమె ప్రశ్నించింది. దీంతో ఎలాగూ కలిసి ఉండలేము, కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందామని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన భాధితురాలు సరేనంది. ఇద్దరూ కలసి చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లారు. అంతలో ఫ్లాట్ ఫాం నెంబర్ 2 మీదకు వస్తున్న గూడ్స్ రైలు కిందికి ఆమెను తోసేసి, ప్రియుడు రామకృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో యువతి రెండు కాళ్లపై నుంచి ట్రైన్ వెళ్లిపోయింది. దీంతో స్థానికులు ఆమెను విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మోకాలి వరకు రెండు కాళ్లు తీసేసిన వైద్యులు ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News