: విద్యార్థుల్లారా, జగన్ వలలో చిక్కుకోకండి: అచ్చెన్నాయుడు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ వలలో చిక్కుకోవద్దని విద్యార్థులకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. కర్నూల్ లో జరిగిన టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ యువభేరిపై ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని చెబుతూ విద్యార్థులను జగన్ తప్పుదోవపట్టిస్తున్నారని, మన రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాపై విద్యార్థులకు తెలియజెప్పేందుకుగాను కర్నూల్ జిల్లా గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాలులో జగన్ ఈరోజు యువభేరి నిర్వహించారు.