: పాకిస్థాన్ లో భారతీయ సినిమాలపై నిషేధం ఎత్తివేత?


ఉరీ సెక్టార్ లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ నటులు నటించిన సినిమాలపై నిషేధం విధిస్తూ ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తామేం తక్కువ తినలేదని పాకిస్థాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కూడా భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో అమలవుతున్న భారతీయ సినిమాలపై నిషేధం కూడా ఎత్తివేసినట్టు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అక్కడి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి పాకిస్థాన్ లోని సినిమా థియేటర్లు భారతీయ సినిమాలపై ఆధారపడి నడుస్తున్నాయి. అలాంటిది భారతీయ సినిమాలను ఆపడమంటే వ్యాపారాలను మూసేసుకోవడమేనని వారు పేర్కొంటున్నారు. భారతీయ సినిమాలపై తాత్కాలిక నిషేధానికి డిస్ట్రిబ్యూటర్లు సహకరించగలరని, దీర్ఘకాలమైతే సహకరించే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాక్ లో భారతీయ సినిమాలపై అనధికారికంగా నిషేధం ఎత్తేసినట్టే. 'ఏ దిల్ హై ముష్కిల్' అక్కడ కూడా రిలీజవనుంది.

  • Loading...

More Telugu News