: విజయ్ మాల్యాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. నోటీసులు జారీ


భారతీయ బ్యాంకుల్లో కోట్ల కొద్దీ రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మాల్యా కేసులో వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు ఆయనకు నోటీసులు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లోగా తెల‌పాల‌ని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్ర‌య‌త్నాలు చేయ‌కూడ‌ద‌ని హెచ్చరించింది. మాల్యా విదేశాల్లో త‌లదాచుకోవ‌డంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందిస్తూ.. మాల్యా ఉద్దేశపూర్వకంగానే భార‌త్‌కు రావ‌డం లేద‌ని చెప్పింది. విదేశాల్లో ఉంటున్న‌ మాల్యా పాస్‌పోర్టును పునరుద్ధరించే విషయంపై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది.

  • Loading...

More Telugu News