: జాక్వెలిన్ పై రణ్ బీర్ కపూర్ సంచలన వ్యాఖ్య!


కత్రినా కైఫ్ తో ప్రేమ విఫలమైన తరువాత రణ్ బీర్ కపూర్ అందాలతార జాక్వెలిన్ పై తాజాగా చేసిన వ్యాఖ్య సంచలనం రేపుతోంది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా ఈ నెల 28 విడుదల కానున్న నేపథ్యంలో రణ్ బీర్ కపూర్ తాజాగా టీవీ రియాలిటీ షో 'ఝలక్ దిఖ్ లాజా'లో గెస్టుగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా యాంకర్ మనీష్ పాల్... 'రాయ్' సినిమాలో నటించిన సందర్బంగా జాక్వెలిన్ తో ఏర్పడిన బంధం గురించి చెప్పాలని కోరాడు. దీనికి రణ్ బీర్ సమాధానమిస్తూ, ఒన్ సైడ్ లవ్ కి ఉన్న పవరే వేరు అన్నాడు. ఇతర ప్రేమల్లోలా ఇక్కడ విడిపోవడమనే మాటే ఉండదని నవ్వుతూ చెప్పాడు. అలాగే జాక్వెలిన్ పై కేవలం తనకు మాత్రమే హక్కు ఉందని అన్నాడు. దీంతో బాలీవుడ్ లో అప్పుడే చర్చ మొదలైంది. కాగా, జాక్వెలిన్ కు రణ్ బీర్, అక్షయ్ కుమార్ తో బలమైన బంధం ఉందని గతంలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News