: ఏపీ సభాహక్కుల సంఘం ముందు విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు


గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్ర‌వ‌ర్త‌న‌పై స‌భా హ‌క్కుల సంఘం నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. స‌భ‌లో ప్ర‌వ‌ర్తించిన తీరుపై స‌మాధానం చెప్ప‌డానికి ఈ రోజు స‌ద‌రు ఎమ్మెల్యేలు స‌భాహ‌క్కుల సంఘం ముందు హాజ‌ర‌య్యారు. నోటీసులు అందుకున్న 12 మంది వైసీపీ స‌భ్యుల్లో ఈ రోజు విచార‌ణ‌కు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు హాజరు కాలేకపోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు.

  • Loading...

More Telugu News