: ప్రత్యేక హోదాపై నాడు మోదీ, వెంకయ్య, చంద్రబాబు మాట్లాడిన వీడియోలను ప్రజలకు చూపించిన జగన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు జిల్లా గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన యువభేరి నిర్వహిస్తున్నారు. హోదాతో రాష్ట్రానికి వచ్చే లాభాలను ఆయన వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా తీసిన వీడియోలను ప్రజలకు జగన్ చూపించారు. ‘ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి.. ఆ రోజు ఎన్నికలప్పుడు హోదా ఎంత అవసరమన్నారో చూడండి. నెల్లూరులో హోదాపై మోదీ ఏం మాట్లాడారో చూడండి. వెంకయ్య ఏమన్నారో చూడండి’ అంటూ జగన్ నాడు హోదాపై వారు మాట్లాడిన వ్యాఖ్యలను చూపించారు. చంద్రబాబు పలు సందర్భాల్లో హోదాపై మాట్లాడిన వీడియోలను కూడా ప్రజలకు జగన్ చూపించారు. ఆనాడు అలా మాట్లాడిన వారు ఇప్పుడు హోదాపై ఎలా మాట్లాడుతున్నారో తెలిపే వీడియోలను కూడా జగన్ చూపించి, నాయకుల తీరును ఎండగట్టారు.