: ఢిల్లీలో పేలుడు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు


దేశ రాజ‌ధాని ఢిల్లీలోని న‌యాబ‌జార్‌లో ఈ రోజు ఉద‌యం పేలుడు క‌లక‌లం రేపింది. మార్కెట్లో పేలుడు ధాటికి ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రి కొంత‌మందికి గాయాల‌య్యాయి. గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న బాంబుస్క్వాడ్ త‌న‌ఖీలు చేప‌ట్టారు. ఏ కార‌ణంగా పేలుడు సంభవించిందో తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News