: భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. మెడిసిన్ చదవడం ఇష్టం లేకపోవడమే కారణం?
నల్లగొండ జిల్లాలో వైద్య విద్యార్థి సాయికుమార్‌రెడ్డి తన నివాసంలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనంపై నుంచి దూకడంతో తీవ్రగాయాలపాలయిన సాయికుమార్‌రెడ్డిని గమనించిన కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న సాయికుమార్‌కు ఉస్మానియాలో సీటు వచ్చింది. అయితే, మెడిసిన్ చదవడం ఇష్టం లేకనే బలవన్మరణానికి పాల్పడినట్లు అతడి బంధువులు చెబుతున్నారు.