: అఖిలేష్ యాదవ్ బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి.. కాకపోతే మాస్ లీడర్ కాదు!: అమర్‌సింగ్


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్ ప్రశంసలు కురిపించారు. ఆయనో ఫెంటాస్టిక్ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. కాకపోతే మాస్ లీడర్‌గా ఎదిగేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. పార్టీని నాశనం చేసేందుకు అమర్‌సింగ్ కంకణం కట్టుకున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమర్‌సింగ్ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయన పాలన, అభివృద్ధిపై దృష్టి సారించారు. అయితే ఆయన మాస్ లీడర్ మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను. అలా ఎదగడానికి అఖిలేష్‌కు మరికొంత సమయం పడుతుంది. ఆయన యువకుడు. నిర్వహణ నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News