: తనకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కన్నడ స్టార్ హీరో


తనకు న్యాయం చేయాలంటూ కన్నడ స్టార్ హీరో దర్శన్ హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ఐడియల్ హోమ్ లేఔట్ లోని ప్రదేశాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆస్తిగా గుర్తించింది. ఇక్కడ కట్టుకున్న ఇళ్లన్నీ కబ్జా చేసి కట్టుకున్నవే అని తెలిపింది. ఈ క్రమంలో, అక్రమ కట్టడాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇళ్ల యజమానులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ లేఔట్ లోనే దర్శన్ ఇల్లు కూడా ఉంది. దీంతో, ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. హలగేవడరహల్లిలో సర్వే నంబర్ 38 నుంచి 46 వరకు, 51 నుంచి 56 వరకు ఉన్న 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమిలో ఐడియల్ హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమ లేఔట్ ను వేశారు. అందులో ఎకరా 38 గుంటల స్థలంలో ఇళ్లు, భవనాలు నిర్మించారు.

  • Loading...

More Telugu News