: తిమ్మాపురం రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీక్.. వందమంది కార్మికులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం!


తూర్పుగోదావరి జిల్లాలోని తిమ్మాపురంలో ఉన్న రొయ్యల శుద్ధి పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో వందమంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 27 మంది మహిళా కార్మికులు కూడా ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో కార్బన్ మోనాక్సైడ్ లీకేజీ వల్లే కార్మికులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News