: జయలలిత డైనమిక్ లీడర్.. రాష్ట్రానికి ఆమె కావాలి: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డైనమిక్ లీడర్ అని, రాష్ట్రానికి ఆమె కావాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను సోమవారం స్వామినాథన్, సీనియర్ నటి ఖుష్బూ పరామర్శించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ మాట్లాడుతూ దీపావళి పండుగకు ముందే జయలలిత పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ సంస్థ సిబ్బంది ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రిలో గత 33 రోజులుగా చికిత్స పొందుతున్న సీఎం ఆరోగ్య పరిస్థితిని లండన్ వైద్యుడు రిచర్డ్ జాన్ బీలో సోమవారం సమీక్షించారు. కొనసాగించాల్సిన చికిత్సపై వైద్యులకు సలహాలు, సూచనలు అందించారు.

  • Loading...

More Telugu News