: బూటకపు ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటాం: మావోయిస్టు నేత జగన్ హెచ్చరిక
ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి జగన్ హెచ్చరించారు. ఏవోబీలో మోసపూరితంగా దాడి చేశారని, ఏకపక్ష కాల్పులతోనే అందరినీ కాల్చి చంపారని అన్నారు. మృతదేహాలను భద్రపరిచి నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ బూటకపు ఎన్ కౌంటర్ పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు.