: సౌకర్యాలు లేకపోతే స్టారైనా, ఆర్టిస్టయినా ఒకటే!: కంగనా రనౌత్


సినిమా జీవితంలో అప్పుడప్పుడు తమకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. బాలీవుడ్ నటి నేహా దూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'నో ఫిల్టర్ నేహా షో'లో పాల్గొన్న కంగనా తన అనుభవాలను వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే... 'క్వీన్' సినిమా షూటింగ్ యూరప్ లో జరిపినప్పుడు అక్కడి కేఫ్ లలో దుస్తులు మార్చుకున్నానని తెలిపింది. అలాగే విశాల్ భరద్వాజ్ తీస్తున్న తాజా సినిమా 'రంగూన్' కోసం అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల లోయప్రాంతంలో రాళ్ల చాటున దుస్తులు మార్చుకున్నానని వెల్లడించింది. ఎలాంటి సౌకర్యాలు లేని చోట ఇలాంటి అనుభవాలు తప్పవని కంగనా తెలిపింది. ఎంచుకునే ప్రాజెక్టులను బట్టి సమస్యలు ఎదురవుతుంటాయని, వాటిని చాలెంజింగ్ గా ఎదుర్కొవాల్సి ఉంటుందని కంగనా పేర్కొంది. అలాంటి సమయాల్లో స్టారయినా, సాధారణ ఆర్టిస్టైనా ఒకేలా ఇబ్బందులు ఉంటాయని తెలిపింది.

  • Loading...

More Telugu News