: భారత్ లక్ష్యంగా.. శ్రీలంక ముస్లింలను ఉగ్రవాదులుగా మారుస్తున్న ‘పాక్’!


భారత్ ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చేస్తున్న మరో కుట్ర తాజాగా బయటపడింది. మన పొరుగు దేశమైన శ్రీలంకలోని ముస్లింలను ఉగ్రవాదం వైపు మళ్లించి, ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు వారిని పంపాలనే దుష్ట ప్రయత్నాలను పాకిస్థాన్ కొన్నాళ్లుగా కొనసాగిస్తోంది. ఈ మేరకు ‘సిలోన్ టుడే’ అనే శ్రీలంక న్యూస్ పేపర్ లో ఒక కథనం వెలువడింది. ఇందుకుగాను, ఉగ్రవాద సంస్థలు అయిన లష్కర్-ఈ-తోయిబా (ఎల్ఈటీ)తో పాటు దాని అనుంబంధ ఛారిటీ సంస్థ ఇదారా ఖిద్మత్-ఈ-ఖాల్క్ (ఐకేకే) ను ఐఎస్ఐ ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొంది. 2004లో సునామీ బీభత్సం తర్వాత ఐకేకే-ఎల్ఈటీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మొదటిసారి గుర్తించారు. ఛారిటబుల్ కార్యక్రమాలను నిర్వహించే నిమిత్తం ఉగ్ర సంస్థలకు చెందిన నిపుణులు మాల్దీవులు, శ్రీలంక దేశాల్లోకి ఆ సమయంలో వెళ్లారని, సేవా కార్యక్రమాల పేరుతో వచ్చి ఆయా ప్రాంతాల్లో జీహాదీలను రిక్రూట్ చేసుకునే ప్రయత్నాలు చేశారని ఆ కథనంలో పేర్కొంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్, ట్రైబల్ ఏరియా ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతాల్లో ఉన్న ‘లష్కరే’ శిక్షణా శిబిరాలలో మాల్దీవులు, శ్రీలంక ప్రాంతాలకు చెందిన ముస్లిం యువకులను కనుగొన్నట్లు పేర్కొంది. శ్రీలంకను కేంద్రంగా చేసుకుని భారత్ పై దాడులు చేయాలనే పన్నాగం పన్నినట్లు ఆ పత్రికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News