: డబ్బు కోసమే 'బిగ్ బాస్ 10'లో పాల్గొంటున్నానన్న స్టార్ విలన్!


టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన రాహుల్ దేవ్ సినిమాల్లో అవకాశాలు లేని కారణంగా 'బిగ్ బాస్ సీజన్ 10'లో పాల్గొంటున్నట్టు తెలిపాడు. సూపర్ మోడల్ పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్న రాహుల్ దేవ్ తరువాత సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. 'బిగ్ బాస్ 10'లో పాల్గొనడంపై ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు సిద్ధార్థ్‌ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడని తెలిపాడు. అతని విద్యకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కోసమే తాను 'బిగ్‌ బాస్‌ షో'లో పాల్గొంటున్నానని చెప్పాడు. దానికి తోడు ప్రస్తుతానికి తన చేతిలో సినిమా అవకాశాలు కూడా లేవని, ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో 'బిగ్‌ బాస్‌' అవకాశాన్ని అంగీకరించానని తెలిపాడు. గతంలో బిగ్‌ బాస్‌ లో అవకాశం వచ్చినప్పుడు తనకు ఇంట్రెస్ట్‌ లేకపోవడంతో అంగీకరించలేదని, ఇప్పుడు మాత్రం పరిస్థితుల ప్రభావం వల్ల 'బిగ్ బాస్'లో పాల్గొంటున్నానని చెప్పాడు. 'మాస్', 'ఒక్కడున్నాడు' వంటి సినిమాలతో రాహుల్ దేవ్ తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

  • Loading...

More Telugu News