: సర్జికల్ స్ట్రయిక్స్ ను చిన్న దీపావళిగా అభివర్ణించిన ప్రధాని మోదీ


పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ ను ‘చిన్న దీపావళి’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మనం సెప్టెంబర్ 29వ తేదీన చిన్న దీపావళి సంబరాలు చేసుకున్నాం’ అని వ్యాఖ్యనించారు. మన సైనికులు ఉగ్రవాదులను హతమార్చినప్పుడు వారణాసిలో ఆనందం వెల్లివిరిసిందని అన్నారు. మన కోసం సైనికులు పగలు, రాత్రి పోరాడుతున్నారని అన్నారు. దీపావళి రోజున మన భద్రతా దళాలకు శుభాకాంక్షలు పంపుదామని ఈ సందర్భంగా మోదీ అన్నారు. కాగా, సెప్టెంబర్ 29వ తేదీన పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం విరుచుకుపడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News