: నవంబర్ 10న అనంతపురంలో పవన్ కల్యాణ్ 'జనసేన' మూడో బహిరంగ సభ


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో బహిరంగ సభ నవంబర్ నెలలో అనంతపురం వేదికగా జరగనుంది. పార్టీ విస్తరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు, సామాజిక సమస్యలపై అనంతపురంలో ఆయన వివరించనున్నారు. ఈ సభను నవంబర్ 10న నిర్వహించనున్నారు. కరవు జిల్లా అనంతపురంను పవన్ కల్యాణ్ ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే కనబడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఏపీకి ప్రత్యేకహోదా కావాలన్న డిమాండ్ కూడా భారీ ఎత్తున వినిపించింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్యమాలు నిలిచిపోయాయి. పార్టీ విస్తరణ ప్రణాళికల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్... తన మూడో బహిరంగ సభ కోసం అనంతపురంను ఎంచుకోవడం ద్వారా వ్యూహాత్మక అడుగు వేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News