: విమానంలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా భారత్ కు రానున్న న్యూజిలాండ్‌ ప్రధాని


ఉత్తర ఆస్ట్రేలియాలో తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన కార‌ణంగా న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌కీ భారత పర్యటన ఆలస్యం కానుంది. విమానంలో సాంకేతిక లోపంతో ఆయ‌న ఈశాన్య క్వీన్స్‌లాండ్‌లోని తీర ప్రాంత పట్టణం టౌన్స్‌విల్లెలోనే ఉండిపోయారు. ఆయ‌న ముంబ‌యిలో పారిశ్రామికవేత్త‌ల స‌మావేశంలో పాల్గొనాల‌నుకున్నారు. అయితే, ఆయ‌న రాక ఆల‌స్యం కానుండ‌డంతో సమావేశం రద్దు కానుంది. భార‌త్‌లో ఆయ‌న నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన వేరే కార్య‌క్ర‌మాలు మాత్రం కొన‌సాగుతాయి. జాన్‌కీతో మరో విమానంలో ఢిల్లీ చేరుకోనున్నార‌ని అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూయడ ఆయ‌న భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News