: ములాయం సింగ్ యాదవ్ వంశ వృక్షం ఇదీ!


దేశ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలపైనే అందరి దృష్టి ఉంది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ కుటుంబసభ్యులు ఈ పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. ములాయం కొడుకు అఖిలేష్ సీఎం అయిన తర్వాత పార్టీ పరిస్థితుల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఆజంఘర్ ఎంపీ అయిన ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ ట్రీ (వంశ వృక్షం) గురించిన వివరాలు.. * శివపాల్ సింగ్ యాదవ్ - ములాయం చిన్న సోదరుడు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎస్పీ లో నంబర్ 2 అని అధికారికంగా చెబుతారు. * రాంగోపాల్ యాదవ్ - ములాయం సింగ్ యాదవ్ కజిన్. రాజ్యసభ సభ్యుడు. ఎస్పీకి చెందిన మేధావుల్లో తాను కూడా ఒకడినని ఆయన నమ్మకం. అమర్ సింగ్ కు బద్ధ వ్యతిరేకి. * మాల్తీ దేవి - ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య. 2003లో ఆమె మరణించారు. * సాధనా గుప్తా యాదవ్ - ములాయంసింగ్ రెండో భార్య. * అఖిలేష్ యాదవ్ - ములాయం సింగ్ మొదటి భార్య సంతానం. యూపీ సీఎంగా ఉన్న అఖిలేష్ వయసు 43 సంవత్సరాలు. * డింపుల్ యాదవ్ - అఖిలేష్ యాదవ్ భార్య. కన్నౌజ్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ. * ప్రతీక్ యాదవ్ -ములాయం సింగ్, రెండో భార్య సాధనల సంతానం. రెజ్లర్ అయిన ప్రతీక్, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఫిట్ నెస్ జిమ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. * అపర్ణా బిస్త్ యాదవ్ - ప్రతీక్ యాదవ్ భార్య. క్లాసికల్, సెమీ-క్లాసికల్ సింగర్. ఎస్పీ టికెట్ పైవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ (కాంట్) నుంచి పోటీ చేయనున్నారు. * ధర్మేంద్ర యాదవ్- ములాయం సింగ్ పెద్దన్నయ్య అభయ్ రామ్ యాదవ్ కొడుకు, బద్వాన్ ఎంపీ * తేజ్ ప్రతాప్ యాదవ్ - ములాయం సింగ్ సోదరుడు రతన్ సింగ్ (లేట్) మనవడు. * అక్షయ్ ప్రతాప్ సింగ్ - రాంగోపాల్ యాదవ్ కుమారుడు. ఫిరోజాబాద్ బాద్ ఎంపీ. * ఆదిత్య యాదవ్ - శివపాల్ యాదవ్ తనయుడు. యూపీ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ * అభిషేక్ యాదవ్ అలియాస్ అన్షుల్ - ములాయం సోదరుడు అభయ్ రామ్ కొడుకు. ఇటవా జిల్లా పంచాయత్ చైర్మన్, ఎస్పీ యువజన సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు * సంధ్యా యాదవ్ - ధర్మేంద్ర యాదవ్ కవల సోదరి. మణిపురి జిల్లా పంచాయత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు * వందనా యాదవ్ - ధర్మేంద్ర యాదవ్ సిస్టర్-ఇన్-లా. హమిర్ పుర్ జిల్లా పంచాయత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు * ప్రేమలతా యాదవ్ - అభిషేక్ యాదవ్ అలియాస్ అన్షులా తల్లి. ఇటావా జిల్లా పంచాయత్ అధ్యక్షురాలుగా ఉన్నారు. * మృదులా యాదవ్ - మైన్ పురి ఎంపి తేజ్ ప్రతాప్ తల్లి. సైఫాయ్ బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సభ్యురాలు. * షీలా యాదవ్ - ధర్మేంద్ర యాదవ్ చెల్లెలు. * అజంత్ సింగ్ యాదవ్ - ములాయం సింగ్ యాదవ్ బ్రదర్-ఇన్-లా

  • Loading...

More Telugu News