: ముస్లిం మహిళల జీవితాలు నాశనం అవుతుంటే ఊరుకోబోం!: తలాక్ పై ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని అధికార పార్టీ సమాజ్‌వాదీపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేశారు. ఈరోజు ఆ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్‌ను ‘ఉత్తమ్ ప్రదేశ్’గా చేయాలనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని ఆయన అన్నారు. యూపీలోని సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయకుండా తిరస్కరించాలని కోరారు. రాష్ట్రంలోని నేతలు ఓ వైపు కుటుంబాన్ని, మరో వైపు అధికారాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇంతవరకూ చూడని అభివృద్ధిని తాను చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత సర్కారుపై, దేశ ప్రజలపై ఉంటుందని మోదీ అన్నారు. ముస్లిం చట్టాల్లో మార్పుల కోసం విభేదిస్తోన్న వారు చర్చల్లో పాల్గొనాలని అన్నారు. తలాక్ వ్యవస్థతో ముస్లిం మహిళల జీవితాలు నాశనం అవుతుంటే తాము ఊరుకోబోమని చెప్పారు.