: వేణు-కల్యాణిల కల్యాణానికి పోలీసులే పెద్దలు!


కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన వేణు-కల్యాణి ప్రేమించుకున్నారు. వేణు కంటే కల్యాణి రెండేళ్లు పెద్దది కావడంతో వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదముద్ర వేయలేదు. దీంతో స్నేహితుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన ఈ ప్రేమజంట తమ వయసు ధ్రువీకరణ పత్రాలను వారికి చూపించారు. దీంతో వారిద్దరూ మేజర్లేనని నిర్ధారించిన పోలీసులు వారికి వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. మూడు రోజుల తరువాత వారిని రావాలని సూచించారు. దీంతో నేడు వారు వివాహానికి సిద్ధమై పోలీసు స్టేషన్ కు చేరుకోగా విషయం తెలిసిన పెద్దలు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టి వేణు-కల్యాణిల వివాహం జరిపించారు. పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడం విశేషం. దీంతో ప్రేమ జంట ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఆందోళనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News